Varun Tej

Varun Tej: వియత్నాంలో వరుణ్ తేజ్ మూవీ ప్రీ ప్రొడక్షన్!

Varun Tej: యంగ్ హీరో వరుణ్ తేజ్ తన 15వ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయబోతున్నాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇండో-కొరియన్ హారర్ కామెడీగా రూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం వియత్నాంలోని అందమైన లొకేషన్స్ ను చూడటానికి వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ, నిర్మాతలు వెళ్ళారు. స్క్రిప్ట్ వర్క్ సైతం మరోవైపు శరవేగంగా సాగుతోందని, మార్చి మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త మేకోవర్‌తో స్క్రీన్‌ పై మెస్మరైజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ కు ఈ సినిమాతో ఆ లోటు తీరుతుందేమో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KCR: అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేదించిన వ్యక్తి చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *