China:

China: భ‌లే చాన్స్ గురూ.. 70 కోట్లలో ఎంత లెక్క పెడితే అంత మీకే సొంతం

China: 70 మీట‌ర్ల పొడ‌వున టేబుళ్లు.. 70 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు.. 15 నిమిషాల స‌మ‌యం.. మీరు ఎంత లెక్క‌పెట్ట‌గ‌లిగితే అంత సొమ్ము మీకే.. ఇందేంది.. ఎక్క‌డ? ఏమిటి? మ‌న‌కు ఏమైనా చాన్స్ ఉండొచ్చా? అని ఆశ‌గా తెలుసుకోవాల‌ని ఉన్న‌ది కదూ. నిజ‌మేనండి.. కాకుంటే మ‌న‌కు కాదు.. చైనాలో ఓ కంపెనీ త‌న ఉద్యోగుల‌కు ఇచ్చిన బోన‌స్ ఆఫ‌ర్ ఇది.

China: చైనా దేశానికి చెందిన హెన‌న్ మైన్ క్రేన్ సంస్థ త‌మ కంపెనీ ఉద్యోగుల‌కు వార్షిక బోన‌స్‌గా రూ.70 కోట్లు ఇచ్చింది. గ‌త 2023 ఏడాది జ‌న‌వ‌రిలోనూ ఇదే విధంగా ఆ సంస్థ 70 కోట్ల రూపాయ‌ల‌ను ఉద్యోగుల‌కు బోన‌స్‌గా ఇచ్చింది. ఈ ఏడాది కూడా తాజాగా ఆ ఉద్యోగుల‌కు ఇదే ఆఫ‌ర్ ఇచ్చింది.

China: 70 మీట‌ర్ల పొడ‌వున ఉన్న టేబుళ్ల‌పై ఆ 70 కోట్ల రూపాయ‌ల సొమ్మును ప‌రిచి ఉంచారు. ఉద్యోగుల‌ను 30 వేర్వేరు బృందాలుగా ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్ నుంచి ఇద్ద‌రు మాత్ర‌మే వ‌చ్చి 15 నిమిషాల్లో ఎంత లెక్క పెడ‌తారో అంత మొత్తాన్ని ఆ టీమ్ తీసుకోవ‌చ్చ‌ని ఆఫ‌ర్ ఇచ్చింది. ఇలా చేసినప్పుడు తీసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ సంస్థ ఉద్యోగులు ఎంత ల‌క్కీయో క‌దా. మ‌న‌కూ ఆ చాన్స్ వ‌స్తే ఎంత బావుడో అని కూడా అనిపిస్తుంది క‌దూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *