Shamshabad Airport:

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు

Shamshabad Airport: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర‌యానికి మ‌రో ఆగంత‌కుడి నుంచి మ‌రోసారి బాంబు బెదిరింపు వ‌చ్చింది. దుండ‌గుగు ఏకంగా సైబ‌రాబాద్ కంట్రోల్ రూంకే గురువారం ఫోన్ చేసి ఈ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఎయిర్ పోర్ట్‌లో బాంబు పెట్టిన‌ట్టు చెప్పాడు. దీంతో పోలీసులు, ఎయిర్‌పోర్ట్ ర‌క్ష‌ణాధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

Shamshabad Airport: వెంట‌నే శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ముమ్మ‌ర త‌నిఖీలు చేప‌ట్టారు. బాంబ్ స్క్వాడ్‌తో అణువ‌ణువు ప‌రిశీలించారు. ఎక్క‌డిక‌క్క‌డ అప్ర‌మ‌త్త‌మై ఏ వైపు నుంచి ముప్పు ఉన్న‌దోన‌నే భయాందోళ‌న నెల‌కొన్న‌ది. అంతా హైరానా ప‌డ్డారు. ఈ లోగా పోలీసులు ఫోన్‌కాల్ చేసిన ఆగంతకుడి వివ‌రాల‌ను రాబ‌ట్టారు.

Shamshabad Airport: బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్య‌క్తి కామారెడ్డి వాసిగా పోలీసులు గుర్తించారు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ కాల్ అని ఎయిర్‌పోర్ట్ అధికారులు తేల్చేశారు. ఫేక్ కాల్ చేసిన ఆ నిందితుడికి మ‌తిస్థిమితం స‌రిగా లేద‌ని గుర్తించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: ఆటో కొనేందుకు క‌న్న‌కొడుకును అమ్మేసింది.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *