Crime News: భర్త ఎక్కడో ఉంటాడు. ముగ్గురు బిడ్డళ్ళతో భార్య ఇండియాలో ఉంటుంది. ఉన్నంతలో కన్న బిడ్డలను చూసుకుంటూ రోజులను లాకొస్తుంది. అంతలోనే అనారోగ్యం. బ్రతుకే భారంగా ఉంది అంటే ..ఈ అనారోగ్యంతో కొత్త తలనొప్పులు . ఎలా ఇప్పుడు ? ఎస్…సోలుషన్ దొరికింది. కానీ ఆ నిర్ణయంలో ఆమెకు న్యాయం జరిగిందో లేదో కానీ…ఆ ముగ్గురు బిడ్డలు మాత్రం మోసపోయారు.
క్షణికావేశంలో తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలు అనాధలు అయ్యారు. తండ్రి గల్ఫ్ బాట పట్టారు . తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో పరి పరిస్థితి దయనీయంగా మారింది.నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండలం కేంద్రంలో మౌనిక అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కొంత ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య కారణాలవల్ల తన పిల్లల భవిష్యత్తు చూడకుండా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.పిల్లల ఏడుపులను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మౌనికకు ముగ్గురు పిల్లలు ఉండడం భర్త గల్ఫ్ దేశంలో ఉండడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


