Sri Lankan Navy

Sri Lankan Navy: భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు.. ఐదుగురికి గాయాలు

Sri Lankan Navy: శ్రీలంక నేవీ మంగళవారం 13 మంది భారత జాలర్లపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఐదుగురు మత్స్యకారులు గాయపడ్డారు. వీరంతా డెల్ఫ్ట్ ద్వీపం సమీపంలో చేపల వేటకు వెళ్లారు. ఈ ద్వీపం శ్రీలంక ఆధీనంలో ఉంది. ఈ మత్స్యకారులు శ్రీలంకలోని జాఫ్నా బోధనాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాల్పులను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం శ్రీలంక తాత్కాలిక హైకమిషనర్‌ను పిలిపించి ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను సహించేది లేదని విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

భారతీయ కాన్సులేట్ అధికారులు గాయపడిన మత్స్యకారులను ఆసుపత్రిలో పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులకు, వారి కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారు.

ఇది కూడా చదవండి: Parliament Budget Session: ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు.. పూర్తయిన సన్నాహాలు

మత్స్యకారుల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని భారత హైకమిషన్ కొలంబోలోని శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెప్పింది. మత్స్యకారులకు సంబంధించిన సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో జీవనోపాధికి సంబంధించిన ఆందోళనలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

బలప్రయోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న అవగాహనను కచ్చితంగా పాటించాలని కోరింది. మత్స్యకారుల సమస్య భారత్‌-శ్రీలంక మధ్య తీవ్రరూపం దాల్చింది . భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2024లో రికార్డు స్థాయిలో 535 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక అరెస్టు చేసింది, ఇది 2023లో దాదాపు రెట్టింపు. 29 నవంబర్ 2024 నాటికి, 141 మంది భారతీయ మత్స్యకారులు శ్రీలంక జైళ్లలో ఉన్నారు. వారికి చెందిన 198 ట్రాలర్లు స్వాధీనం చేసుకున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ram gopal Varma: వర్మ వ్యంగ్యాస్త్రాలు.. సోషల్ మీడియాలో దుమారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *