Suryapet

Suryapet: తెలంగాణలో మరో పరువు హత్య కలకలం

Suryapet: ఆ అబ్బాయి చనిపోయాడు. అతడిని చంపడానికి ఎవరికి ఎలాంటి కారణాలు లేవు. కానీ చనిపోయాడు. మరి ఎవరు చంపారు. ఇక్కడే ఒక్క ట్విస్ట్ . ఆ అబ్బాయి ఓ అమ్మాయి ని ప్రేమించాడు. తాం యూ ప్రేమించిన అమ్మాయి కాస్ట్ వేరే. వీరిద్దరూ ప్రేమించుకోవడం ఆ ఇంట్లో ఇష్టం లేదు. మరి..ఈ మరణానికి ..ప్రేమకు సంబంధం ఉన్నట్లే కదా ?

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లేడీ కానిస్టేబుల్ పరువు హత్య ఘటన మరవకముందే తెలంగాణలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఆర్ధరాత్రి నగర శివారులోని మూసీ కాల్వ కట్టపై హత్యకు గురయ్యాడు. యువకుడిని గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోది కిరాతకంగా హత్య చేశారు. కులాంతర వివాహం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Suryapet: సూర్యాపేట జిల్లా మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడు. అదే ప్రాంతానికి చెందిన భార్గవి ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా.. కులాలు వేరు కావటంతో పెళ్లికి భార్గవి సోదరుడు ఒప్పుకోలేదు. దీంతో ఆరు నెలల క్రితం ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. చెల్లెలు భార్గవి కులాంతర వివాహం చేసుకోవడం ఆమె అన్నకు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ క్రమంలో కృష్ణపై భార్గవి సోదరుడు పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే కృష్ణను హత్య చేసినట్లు తెలిసింది.

మహేష్ అనే యువకుడి నుంచి కృష్ణకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడిన కృష్ణ.. భార్యకు కూడా చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవటంతో భర్తకు కాల్ చేసింది. ఫోన్‌కు స్పదించకపోటవంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికి చూశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే పట్టణ శివారులోని మూసీ కాల్వ గట్టుపై శవమై తేలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తన భర్త హత్యకు మహేష్ కారణమై ఉంటాడని భార్గవి అనుమానిస్తోంది. ఇందులో తన అన్న పాత్ర కూడా ఉండి ఉంటుందని కన్నీరు పెట్టుకుంది. కాగా, ఇప్పటికే భార్గవి సోదురుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *