Balakrishna:

Balakrishna: “ప‌ద్మ‌” పుర‌స్కారంపై బాల‌కృష్ణ ఏమ‌న్నారంటే?.. ప్ర‌ముఖుల‌ అభినంద‌న‌ల వెల్లువ‌

Balakrishna:ప్ర‌ముఖ తెలుగు సినీ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ సినీ రంగానికి చేసిన విశేష సేవ‌ల‌కు గాను ఆయ‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఆయ‌న‌కు ప‌లువురు అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేర‌కు త‌న‌కు ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారం ద‌క్క‌డంపై తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ స్పందించారు.

Balakrishna:ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారాన్ని త‌న‌కు ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వానికి నంద‌మూరి బాల‌కృష్ణ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. నా ఈ సుధీర్ఘ ప్ర‌యాణంలో పాలుపంచుకున్న తోటి న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు, నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కు, ఎగ్జిబిట‌ర్ల‌కు, కుటుంబ‌స‌భ్యుల‌కు, యావ‌త్ తెలుగు చ‌ల‌న చిత్ర రంగానికీ నా ధ‌న్య‌వాదాలు. నా వెన్నంటి ఉండి న‌న్ను ప్రోత్స‌హిస్తున్న నా అభిమానుల‌కు, నాపై విశేష ఆద‌రాభిమానాలు కురిపిస్తున్న ప్రేక్ష‌కుల‌కు స‌దా రుణ‌ప‌డి ఉంటాను అని బాల‌కృష్ణ పేర్కొన్నారు. అదే విధంగా ఇత‌ర ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌లంద‌రికీ ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు.
ప్ర‌ముఖుల అభినంద‌న‌లు
Balakrishna:టాలీవుడ్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణకు ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారాన్ని కేంద్రం ప్ర‌క‌టించ‌డంపై ప‌లువురు సినీ రంగ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు అభినంద‌న‌లు, శుభాకాంక్ష‌లు తెలిపారు. అగ్ర క‌థానాయ‌కుడు, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నటులు మ‌హేశ్‌బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ఎం.మోహ‌న్‌బాబు, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, మంచు విష్ణు, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోపాటు ప‌లువురు బాల‌కృష్ణకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KTR: రైతు సంక్షేమంపై చ‌ర్చిద్దాం రండి.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ స‌వాల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *