Mobile Phone Walking

Mobile Phone Walking: అయ్యో ఫోన్ ముచ్చట్లేనా.. చూసుకునే పనిలేదా.. చేతిలో పసిపాపతో డ్రైనేజిలో పడిన మహిళ

Mobile Phone Walking: రోడ్డుమీద నడుస్తున్నపుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పక్క ట్రాఫిక్ ఇబ్బందులతో నడవడానికి కూడా కష్టంగా ఉండే పరిస్థితి. మరోపక్క మున్సిపాలిటీల నిర్వాకంతో రోడ్డుపై నోర్లు తెరుచుకుని చూసే డ్రైనేజీ మ్యాన్ హొల్స్ తో ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. రోడ్డుపై వాహనాలు నడిపేవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో.. నడుస్తూ వెళ్లేవారు అంత జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ఎంత ప్రమాదమో.. నడవడమూ అంతే ప్రమాదాన్ని తీసుకు వస్తుంది. ఇదిగో ఒక చేతిలో పసిపాపను ఎత్తుకుని.. మరో చేత్తో మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ వెళుతున్న ఒక మహిళ రోడ్డు మీద ఉన్న మ్యాన్ హోల్ లో పడిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.

పసిపాపతో మొబైల్ ఫోన్ మాట్లాడుతూ హర్యానాలో ఓ మహిళ రోడ్డుపై తెరిచి ఉన్న మురుగు కాలువలో పడి ప్రమాదానికి గురైంది. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన యువతి ఇటీవల తన 1 ఏళ్ల పాపతో షాపింగ్ వీధిలో నడుస్తోంది.

ఇది కూడా చదవండి: Uttar Pradesh: వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని భర్త అనుమాస్పద మృతి.. భార్య ఎంత పని చేసిందంటే!

Mobile Phone Walking: ఆ ప్రాంతంలో రోడ్డు వెంబడి భూగర్భ మురుగు కాలువ ఉంది. అందులో డ్రైనేజీ పూడిక తీశారు. ఆ తరువాత మ్యాన్ హోల్ మూయకుండా మున్సిపల్ సిబ్బంది అలానే వదిలేశారు. రోడ్డుపక్కగా ఉన్న ఆ మ్యాన్ హోల్ ప్రమాదాలకు కారణం కాకూడదని అక్కడే ఉన్న ఒక దుకాణ దారుడు రోడ్డుపై బిల్‌బోర్డ్‌తో ప్రజలు పడిపోకుండా, ప్రమాదానికి గురికాకుండా అడ్డుగా పెట్టాడు.

ఇక ఈ క్రమంలో మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ వీధి గుండా వెళ్తున్న మహిళ.. భూగర్భ మురుగు కాల్వ తెరిచి ఉండడంతో అందులో పడిపోయింది. ఇది గమనించిన పక్కనే ఉన్న వ్యక్తి పరుగున వచ్చి మురుగు కాలువలోకి దిగి చిన్నారిని, మహిళను సురక్షితంగా రక్షించాడు. ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.

ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కార్పొరేషన్ పాలకవర్గం నిర్లక్ష్యమే ఇందుకు కారణమని వీడియో చూసివారు ఆరోపిస్తున్నారు. మరి కొందరు రోడ్డుపై వెళ్లేటప్పుడు మొబైల్ ఫోన్ల వల్ల దృష్టి మరల్చకూడదని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *