Guard: విరాజ్ రెడ్డి చీలం హీరోగా నటించిన సినిమా ‘గార్డ్’. ‘రివేంజ్ ఫర్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. థ్రిల్లర్, హారర్ అంశాలతో జగ పెద్ది దర్శకత్వంలో దీనిని అనసూయ రెడ్డి నిర్మిస్తున్నారు. మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో సెక్యూరిటీ గార్డ్ పాత్రలో హీరో విరాజ్ రెడ్డి కనిపించారు. యూత్ కోరుకునే లవ్, యాక్షన్, హారర్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని ఈ టీజర్ చూస్తుంటే అర్థమౌతోంది. ఫిబ్రవరిలో ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీకి సిద్ధార్థ్ సదాశివుని సంగీతం సమకూర్చారు.
