Identity ott release

Identity ott release: ఓ పక్క థియేటర్ లో మరో పక్క ఓటీటీలో!

Identity ott release: థియేటర్లలో విడుదలైన యాభై రోజులు లేదా కనీసం ముప్పై రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయాలనే నిబంధన ఉంది. అయితే ఫ్లాప్ అయిన సినిమాలను ఈ లోగానే ఓటీటీలో నిర్మాతలు ప్రదర్శించేస్తున్నారు. చిత్రం ఏమంటే… తాజాగా తెలుగులో విడుదలైన మలయాళ అనువాద చిత్రం ‘ఐడెంటిటీ’ థియేట్రికల్ రిలీజ్ కు వారం తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళంలో ఈ సినిమా జనవరి 2న విడుదల చేశారు. మొదటి రెండు, మూడు వారాల్లోనే ఈ చిత్రం అక్కడ దాదాపు యాభై కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ స్పందనను దృష్టిలో పెట్టుకుని తెలుగులో డబ్ చేసి 24న విడుదల చేశారు. చిత్రంగా ఇప్పుడీ సినిమా జనవరి 31న ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. కేవలం మలయాళ వర్షన్ ను మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ దీనిని అందిస్తున్నామని జీ 5 సంస్థ తెలిపింది. మరో వారంలో ఓటీటీలో చూసే ఛాన్స్ ఉన్నప్పుడు పని కట్టుకుని ఎవరైనా థియేటర్ కు ఎందుకు వెళ్తారని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఈ అడ్డగోలు నిర్ణయాల కారణంగానే సినిమాల థియేట్రికల్ కలెక్షన్స్ కు గండిపడుతున్నాయని పంపిణీదారులు వాపోతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Isha Talwar: బాలీవుడ్ నటి ఇషా తల్వార్‌కు ఎదురైన వింత అనుభవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *