Payal Rajput: ఆర్.ఎక్స్. 100`తో బుల్లెట్ లా తెలుగు చిత్రసీమలోకి దూసుకొచ్చింది పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినా… `మంగళవారం మూవీతో అందరినీ తన నటనతో ఆకట్టుకుంది. తాజాగా పాయల్ రాజ్ పుత్ నాయికగా మరో సినిమా మొదలైంది. ముని దర్శకత్వంలో రాజా, ఎన్.ఎస్. చౌదరి దీనిని నిర్మిస్తున్నారు. ట్రైబల్ గర్ల్ రివైంజ్ స్టోరీగా ఇది తెరకెక్కబోతోందని, తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో విడుదల చేస్తామని వారు తెలిపారు. మంగళవారం తర్వాత చాలా కథలు విన్నానని, నచ్చక రిజెక్ట్ చేశానని, ఈ కథ వినగానే ఎంతో నచ్చేసిందని పాయల్ రాజ్ పుత్ చెప్పింది. ఈ సినిమాకు వికాస్ బడిశా సంగీతాన్ని అందిస్తున్నారు.

