Samyuktha Menon: సినిమాల్లో నటించే హీరోయిన్లకు ఓ సౌలభ్యం ఉంది. అవకాశం చిక్కాలే కానీ ఏ జనరేషన్ స్టార్స్ తో అయిన జోడీ కట్టడానికి వారు సై అనేస్తుంటారు. అయితే వారసులు చిత్రసీమలోకి అడుగుపెట్టిన తర్వాత తండ్రీ కొడుకులతోనూ జత కట్టిన హీరోయిన్లు కొందరున్నారు. తాజాగా ఆ జాబితాలోకి సంయుక్త పేరు చేరింది. అయితే తండ్రీ కొడుకులతో కాకుండా ఆమె అబ్బాయి, బాబాయ్ సరసన నటిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన బింబిసార, డెవిల్ చిత్రాలలో నటించింది సంయుక్త మీనన్. ఆమె నటించిన చిత్రాల జయాపజయాల మాట ఎలా ఉన్నా అమ్మడికి అవకాశాలైతే బాగానే వస్తున్నాయి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ బాబాయ్, నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన కూడా సంయుక్త కు ఛాన్స్ దక్కింది. బాలయ్యబాబు హీరోగా బోయపాటి శీను తెరకెక్కిస్తున్న అఖండ -2 షూటింగ్ ఇటీవల మొదలైంది. ఇందులో నాయికగా సంయుక్త ను ఎంపిక చేశారు. నందమూరి తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా ఇదే యేడాది సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
