Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద కార్ బీభత్సం సృష్టించింది. మితి మీరిన వేగం తో అదుపుతప్పిన కార్ పక్కనే ఉన్న ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఒకరు మృతి చెందగా. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలో ఉన్న హాస్పిటల్ కి తరలించారు. యాక్సిడెంట్ తర్వాత కారులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని విడిచి పారిపోయారు.