Allu Aravind: సినిమావాళ్ళకు సెంటిమెంట్స్ ఎక్కువ. అగ్ర నిర్మాతలు అందుకు మినహాయింపు కాదు! ఇటీవల జరిగిన ఓ సంఘటనతో అల్లు అరవింద్ కూడా అదే జాబితాలోకి చేరతారనిపిస్తోంది. ఆయన సమర్పణలో బన్నీ వాసు తీసిన ప్రతి రోజూ పండగే మూవీ రిలీజ్ సమయంలో స్టేజ్ మీద సత్యరాజ్ తో కలిసి అల్లు అరవింద్ సరదాగా స్టెప్పులేశారు. ఇప్పుడు అదే పనిని ఆయన తండేల్ మూవీ సాంగ్ రిలీజ్ టైమ్ లో రిపీట్ చేశారు. గురువారం సాయంత్రం ఓ కాలేజీలో జరిగిన తండేల్ సాంగ్ రిలీజ్ ఫంక్షన్ లో చిత్ర బృందం పాల్గొంది. అక్కడో అమ్మాయి స్టేజీ ఎక్కి తనతో డాన్స్ చేయమని కోరగానే అల్లు అరవింద్ తన వయసును కూడా మర్చిపోయి… సరదాగా ఆమెతో స్టెపులేశారు. అల్లు రామలింగయ్య తనయుడైన అరవింద్ లో మంచి నటుడు కూడా ఉన్నాడు. గతంలో కొన్ని సినిమాల్లో నటించిన అరవింద్ ఆ తర్వాత చిత్ర నిర్మాణం, ఇతర వ్యాపకాలతో నటనను పక్కన పెట్టేశారు. అప్పుడప్పుడూ ఇలా ఆయనలోని చిలిపి నటుడు బయటకు వస్తుంటాడు. ఏదేమైనా ప్రతి రోజూ పండగే తరహాలో తండేల్ కూడా చక్కని విజయాన్ని సాధిస్తే… రాబోయే రోజుల్లో తన ప్రతి సినిమా ఈవెంట్ లోనూ అరవింద్ సెంటిమెంట్ గా డాన్స్ చేస్తారేమో!
When #AlluAravind garu Dance on stage 💥
Last time #PratiRojuPandage – Blockbuster🔥
Now #Thandel – Blockbuster loading.. ⏳ pic.twitter.com/rOJceZiKAH
— Censor Talk (@TheCensorTalk) January 23, 2025
