CM Revanth Reddy:సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. దావోస్ నుంచి నేరుగా దుబాయ్ చేరుకొని అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ బృందానికి హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లి శాలువాలు కప్పి, బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
CM Revanth Reddy:ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి, దానం నాగేందర్, ఈర్లపల్లి శంకర్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి తదితరులు ఈ స్వాగత ఏర్పాట్లు చేశారు. భారీ పెట్టుబడులను ఆకర్షించి, కీలకమైన ఒప్పందాలు చేసుకొని, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రానికి వచ్చిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రైజింగ్ బృందాన్ని వారు ఘనంగా సత్కరించారు.
CM Revanth Reddy:దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి బృందం అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక వేత్తలతో విస్తృతంగా చర్చలు జరిపింది. పారిశ్రామిక వేత్తలు తమ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన విధానాలు, కొత్త పాలసీలను, తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను వారికి వివరించింది. ఈ మేరకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది.
CM Revanth Reddy:ఈ నాలుగు రోజు పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకున్నది. అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థ అయిన అమెజాన్ రూ.60 వేల కోట్లు పెట్టేందుకు తెలంగాణ సర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. దాంతోపాటు మరో కీలక సంస్థ అయిన సన్ పెట్రో కెమికల్స్ సంస్థ రూ.45,500 కోట్ల పెట్టుబడులు, కంట్రోల్ ఎస్ సంస్థ రూ.10 వేల కోట్లు, జేఎస్‌డబ్ల్యూ సంస్థ రూ.800 కోట్లు, స్కైరూట్ ఏరో స్పేస్ రూ.500 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ సంస్థ రూ.15,000 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.750 కోట్ల చొప్పున తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు ముందుకొచ్చాయి.