Orange re release

Orange re release: వాలెంటైన్స్ డేకు మరోసారి వస్తున్న ఆరెంజ్

Orange re release: రామ్ చరణ్‌ నటించిన మూడో చిత్రం ఆరంజ్. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో చిరుత`తో హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్ రెండో సినిమా `మగధీర`తో ఇండస్ట్రీ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన `ఆరెంజ్ మాత్రం అతనికి పరాజయాన్ని అందించింది. అయితే ఆ సినిమా తన మనసుకు అది దగ్గరగా ఉంటుందని ఇప్పటికీ రామ్ చరణ్ చెబుతుంటాడు. మళ్ళీ ఇంతకాలానికి ప్రేమికుల రోజు సందర్భంగా ఆరెంజ్ మూవీ థియేటర్లలో విడుదల కాబోతోంది. పది హేనేళ్ళ క్రితం వచ్చిన ఆరెంజ్`కు హ్యారీస్ జైరాజ్ అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. మూవీ కమర్షియల్ గా హిట్ కాకపోయినా… అందులో పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. మరి `ఆరెంజ్ మూవీ స్పెషల్ షోస్ కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *