‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ వచ్చేసింది

Appudo Ippudo Eppudo Teaser: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కొత్త చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. ఈ మూవీని ద‌ర్శకుడు సుధీర్ వ‌ర్మ తెరకెక్కించారు. ‘స‌ప్త సాగ‌రాలు దాటి’ సినిమాతో తెలుగువారిని కూడా ఆక‌ట్టుకున్న రుక్మిణి వ‌సంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రో క‌థానాయిక‌గా దివ్యాంశ కౌశిక్ న‌టిస్తున్నారు. తాజాగా ఈసినిమా టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లో హీరో నిఖిల్ రేస‌ర్‌గా క‌నిపించాడు.

హైదారాబాద్‌లోని ఒక బ‌స్తిలో ఉండే హీరో లండ‌న్ వెళ్లి ఒక అమ్మాయిని ప్రేమ‌లో ప‌డేసి లైఫ్‌లో సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. అయితే దీనికోస‌మే లండ‌న్ వెళ్లిన నిఖిల్‌కు అక్కడ ఎదురైన సంఘ‌ట‌నలు ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ అని తెలుస్తుంది. ఓ లవ్ స్టోరీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నట్లు టీజ‌ర్ చూస్తే అర్థమ‌వుతుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడ‌క్షన్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రక‌టించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KA: రూ. 50 కోట్ల గ్రాస్ సాధించిన 'క'

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *