Viral News: పండుగకు మీరు ఊరెళ్తున్నారా? విలువైన వస్తువులు, నగలు, నగదు ఇంటిలోనే ఉంచారా? తాళాలు వేసి, సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇచ్చి వెళ్లండి.. ఇది పోలీస్ శాఖ ప్రతి పండుగకు ముందు ఇలాంటి ప్రచారం చేస్తూ ఉంటుంది. ఈ సంక్రాంతికి ఇదే విధంగా కోరింది. అయితే ఓ ఇంటి యజమాని మాత్రం వినూత్నంగా ఓ నోట్ రాసి తన తలుపుకు అతికించి మరీ వెళ్లాడు. ఆ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Viral News:సంక్రాంతికి అత్యధిక సంఖ్యలో తమ సొంతూళ్లకు వెళ్లారు. ఆ ఇంటి యజమాని తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లారు. అయితే ఇక్కడే తన మెదడుకు ఓ విషయం తోచింది. దొంగలొస్తారేమోనని భావించాడో, వినూత్నంగా ఉంటుందని అనుకున్నాడో? ఏమో కానీ ఓ నోట్ రాసి తలుపునకు అంటించి వెళ్లాడు. ఆ నోట్‌ను ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది ప్రపంచమంతా చూసింది.
Viral News:ఆయనగారు రాసి తలుపునకు అంటించిన లేఖ ఇలా ఉన్నది. “మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం. డబ్బు, నగలు మా వెంట తీసుకొని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి – ఇట్లు మీ శ్రేయోభిలాషి” అని రాసి ఉన్నది. పండుగల వేళ నగరాలు, పట్టణాల నుంచి తాముండే ఇండ్లకు తాళాలేసి సొంతూళ్లకు వెళ్తుంటారు. ఇదే అదనుగా భావించిన దొంగలు రెచ్చిపోతుంటారు. కానీ, ఈ ఘనుడు మాత్రం దొంగలకే షాక్ ఇస్తూ సందేశంతో కూడిన లేఖను రాయడం ఆసక్తిగా మారింది. ఈయనెవరో? ఎక్కడో? కానీ దొంగలకే లేఖ రాశాడు! అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.