Health Troubles: అకస్మాత్తుగా ఆ గ్రామంలో కొంతమందికి వాంతులు మొదలయ్యాయి. తరువాత తలనొప్పితో సతమతమయ్యారు. కొంతసేపటికి స్పృహతప్పి పడిపోయారు. దీంతో గ్రామంలో కలకలం రేగింది. ఈ ఘటన ఉత్తర కర్ణాటక ఎల్లాపూర్ తాలూకా తోమగేరి గ్రామం కౌలివాడలో చోటు చేసుకుంది. దీంతో వైద్య అధికారులు రంగంలోకి దిగారు వారు పూర్తిగా అక్కడ పరిశీలించి జరిగిన పొరపాటును సరిదిద్దారు. అసలేమైందంటే..
Health Troubles: అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది. అందులోని నీళ్లు తాగడం వల్లే ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది వైద్య నిపుణులు తేల్చారు. ఆ నీటి సాంపిల్ తీసుకుని పరీక్షలకు పంపారు. అందుకో కొద్దిపాటి విషపు ఛాయలు కనిపించాయి. దీంతో ట్యాంక్ ను పరిశిలించారు. ట్యాంక్ నుంచి విపరీతమైన దుర్వాసన రావడం గమనించి.. నీరు ఖాళీ చేయించి ట్యాంక్ లో చెక్ చేశారు. అక్కడ చచ్చి పడిన పాము కనిపించింది. దీంతో అందరూ అవాక్కయ్యారు.
Health Troubles: వెంటనే ట్యాంక్ ను శుభ్రం చేసి ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరికొంత మందికి ఇంటివద్దనే చికిత్స అందిస్తున్నారు.