Tips For Weight Loss: ఆధునిక కాలంలో అందరినీ వేధించే సమస్య అధిక బరువు. బరువు తగ్గేందుకు కొంతమంది రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు. అయితే తక్కువ కేలరీలు ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. బరువు తగ్గే సమయంలో చాలా మంది పండ్ల రసాయనాలు ఎక్కువగా తాగుతారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు కొన్ని రకాల పానియాలను తీసుకోవద్దు.. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..
పండ్ల రసం
బరువు తగ్గడానికి ప్రయత్నించేటప్పుడు పండ్ల రసాలు తాగడం కరెక్ట్ కాదు. పండ్ల రసాలలో ఫైబర్ ఉండదు. కేలరీలు, చక్కెర ఉంటాయి. రసం బదులు పండును అలాగే తింటే ఎక్కువ లాభాలుంటాయి.
కార్బొనేటేడ్ పానీయాలు
కార్బొనేటేడ్ డ్రింక్స్ లో ఎటువంటి పోషకాలు ఉండవు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో సోడా కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యంపై చెడు 1ప్రభావం చూపుతుంది.
మద్యం
ఆల్కహాలిక్ డ్రింక్స్ లో ఎటువంటి పోషకాలు ఉండవు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి హానీ కలుగుతుంది. ఆల్కహాల్ తో పాటు చిప్స్, ఇతర రుచికరమైన స్నాక్స్ తీసుకోవడం వల్ల మొత్తం కేలరీల సంఖ్య పెరుగుతుంది.
ఆరోగ్యకరమైన పానీయం
వ్యాయామం తర్వాత ఆరోగ్యకరమైన పానీయం తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. కానీ అధిక మోతాదులో కెఫీన్ తీసుకోవడం వల్ల హార్ట్ బీట్, రక్తపోటును పెంచుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారి ఇటువంటి పానియాలు కాకుండా పండ్లు, కొన్న జ్యూసులు తీసుకోవాలి.
