Pushpa: అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప ది రూల్’ మరో సూపర్ హిట్‌గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, డిసెంబర్ 5న విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా ఇప్పటికే ‘బాహుబలి 2’ రికార్డును, అలాగే బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్ల రికార్డును బద్దలుకొట్టింది. ప్రస్తుతం రూ.2000 కోట్ల కలెక్షన్ దిశగా దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో, చిత్రబృందం ప్రేక్షకుల కోసం కొత్త అనౌన్స్‌మెంట్ చేసింది. విడుదలకు ముందు తీసివేసిన 20 నిమిషాల డిలీట్ చేసిన సీన్స్‌ను జనవరి 11నుంచి తిరిగి సినిమాకు జతచేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సీన్స్‌లో ప్రధానంగా పుష్ప ఎంట్రీ సీన్‌లో వచ్చిన ఫైట్‌లో నీటిలో పడ్డ సీన్ను తిరిగి చేర్చనున్నారు. అంతేకాకుండా, కన్నడ నటుడు తారక్ పొన్నప్పతో వచ్చే మరో యాక్షన్ సీన్‌ను కూడా జతచేయబోతున్నారు. ఈ కొత్త సీన్స్‌తో సినిమా మరింత ఆకర్షణీయంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

