చైనా వైరస్ HMPV భారత్ లో మొదటి కేసు వచ్చిన ఒకరోజులోనే 7కేసులు నమోదు అయ్యాయి. నిన్న బెంగళూరు ఆస్పత్రిలో ఈ వైరస్ సింటమ్స్ ఇద్దరు చిన్నారుల్లో గుర్తించారు. అందులో 8,3 వయసు ఉన్న ఇద్దరు చిన్నారులకు ఈ HMPV వైరస్ సోకినట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఈ న్యూస్ వచ్చిన కొద్ది గంటల్లోనే గుజరాత్ లో మరో కేసు నమోదైంది. ఇది ఇలాఉంటే నేడు తమిళనాడులో కొత్తగా 2 కేసులు గుర్తించారు చెన్నై, సేలంలో ఈ కేసులని గుర్తించారు.
ఇది కూడా చదవండి: Humanity Dies: మా పరిధి కాదు.. మాదీ కాదు.. పోలీసుల ఓవర్ యాక్షన్.. పట్టని ప్రజల ఎమోషన్
HMPV నుండి కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
HMPV Virus: హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (హెచ్ఎంపీవీ)ఇండియాలోకి ఎంటర్ అయింది. కర్నాటకలోని ఒక ఆసుపత్రిలో ఇద్దరు పిల్లలకు (ఒకరు 3 నెలలు , మరొకరు 8 నెలలు) మరియు గుజరాత్లోని ఒక బిడ్డ (2 నెలలు)లో ఇన్ఫెక్షన్ కనిపించింది. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఆమోదించింది.
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (hMPV)కి చికిత్స లేదు. కానీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడే కొన్ని మందులు ఉన్నాయి. నొప్పి నివారణలు, దగ్గు సిరప్లు , ఓవర్-ది-కౌంటర్ జలుబు మందులు ఈ ఇన్ఫెక్షన్ నుండి కోలుకోవడానికి మీకు సహాయపడతాయి. ఒక తాత్కాలిక ఇన్హేలర్, శ్వాసలో గురక, దగ్గు యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు.
7-10 రోజులలోపు కోలుకుంటారు. ఒక వారంలోపు మీ లక్షణాలు మెరుగుపడకపోతే లేదా మీరు తీవ్రమైన అసౌకర్యాన్ని అనుభవిస్తున్నట్లయితే పరిస్థితి మరింత దిగజారితే వైద్యల సలహాను తీసుకొండి. HMPV అనేది శ్వాసకోశ వైరస్, ఇది మొదట 2001లో కనుగొనబడింది. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ నుండి కోలుకోవడం 3-6 రోజుల వరకు ఉంటుంది.
HMPV అనేది వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించే శ్వాసకోశ వ్యాధి. దగ్గు, జ్వరం, ముక్కు మూసుకుపోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? :
1. మీ చేతులను తరచుగా సబ్బు, నీటితో కడగాలి.
2. తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు మీ ముక్కు , నోటిని అడ్డుపెట్టుకోవాలి.
3. ఇన్ఫెక్షన్ కనిపించినప్పుడు, మీ చుట్టూ గుమిగూడకుండా ఉండండి.
4. మీరు అనారోగ్యంతో ఉంటే మాస్క్ ధరించండి.
5. ముఖం, కళ్ళు, ముక్కు నోటిని తరచుగా తాకడం మానుకోండి.
6. ఇతరులతో ఆహారాన్ని పంచుకోవడం మానేయండి.