Game Changer: ‘గేమ్ ఛేంజర్’ టిక్కెట్లు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10న మూవీ భారీ స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం రాత్రి 1 గంటలకు ప్రదర్శించే బెనిఫిట్ షోకు జి.ఎస్.టి.తో కలిపి రూ. 600 పెంచుకోవచ్చునని తెలిపింది. అలానే 10వ తేదీ ఆరు షోస్ కు అనుమతి ఇచ్చింది. 11వ తేదీ నుండి 23వ తేదీ వరకూ ‘గేమ్ ఛేంజర్’ మూవీని ఐదు షోస్ వేసుకోవచ్చని తెలిపింది. ఈ రెండు వారాల పాటు మల్టీప్లెక్స్ థియేటర్లు 175 రూపాయలు, సింగిల్ థియేటర్లు రూ. 135 పెంచుకునే సౌలభ్యాన్ని కలిగించింది. మరి ‘గేమ్ ఛేంజర్’ టిక్కెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోస్, అదనపు ఆటల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

