PM Narendra Modi:

PM Narendra Modi: చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్‌ను వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ.. 8న ఏపీకి రాక‌

PM Narendra Modi: ద‌క్షిణ మ‌ధ్య రైల్వే విభాగం చ‌రిత్ర‌లోనే ఓ కీల‌క మ‌లుపుగా భావించే చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్‌ను దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సోమ‌వారం వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. గ‌తంలో ప‌లుమార్లు ప్రారంభ కార్య‌క్ర‌మాలు వాయిదాప‌డుతూ వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు ఈ రోజు ప్రారంభంతో టెర్మిన‌ల్ సేవ‌లు మొద‌ల‌య్యాయి. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణ‌వ్‌, కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్, రాష్ట్ర మంత్రి శ్రీధ‌ర్‌బాబు త‌దిత‌రులు చ‌ర్ల‌ప‌ల్లి టెర్మిన‌ల్ ప్రారంభోత్స‌వంలో నేరుగా పాల్గొన్నారు.

PM Narendra Modi: విమానాశ్ర‌యం త‌ర‌హాలో రూ.413 కోట్ల‌తో ఈ చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్‌ను అత్య‌ద్భుతంగా నిర్మించారు. నేటి నుంచి ఈ రైల్వే టెర్మినల్ నుంచి 13 జ‌త‌ల రైళ్లు రాక‌పోక‌లు సాగిస్తాయి. మ‌రో 12 జ‌త‌ల రైళ్ల రాక‌పోక‌ల‌ను సాగించేందుకు కూడా రైల్వే అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీ, చెన్నై, విశాఖ‌పట్నం, కోల్‌క‌త్తా వెళ్లే రైళ్ల‌ను చ‌ర్ల‌ప‌ల్లి మీదుగా న‌డిపించ‌నున్న‌ట్టు అధికారులు వెల్ల‌డించారు.

PM Narendra Modi: దేశ‌వ్యాప్తంగా రైల్వే మౌలిక స‌దుపాయాల‌ను పెంచ‌డంలో భాగంగా కేంద్రం చేప‌ట్టిన ప‌నుల్లో ఈ రైల్వే టెర్మిన‌ల్‌ను అత్యద్భుతంగా నిర్మించి, ప్ర‌ధాని చేతుల‌మీదుగా ప్రారంభించామ‌ని కేంద్ర‌ మంత్రులు ఈ సంద‌ర్భంగా తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జారవాణా వ్య‌వ‌స్థ మెరుగున‌కు ప్రాధాన్యం ఇస్తుంద‌ని వారు చెప్పారు. ఇంకా వేలాది కోట్ల‌తో ప‌లు రైల్వే మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు.

PM Narendra Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ నెల 8న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను మంత్రి నారా లోకేశ్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. ఇటీవ‌ల ప్ర‌ధాని అయ్యాక రెండోసారి ఆయ‌న ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. విశాఖ త‌దిత‌ర ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని రోడ్‌షో కూడా ఉండ‌నున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  PM Modi: త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌ధాని మోదీ.. కీల‌క కేంద్రం శంకుస్థాప‌న‌?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *