Kangana Ranaut

Kangana Ranaut: ఇందిరా గాంధీగా కంగనా ట్రాన్స్ ఫర్మేషన్!

Kangana Ranaut: గతంలో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయ్ గా నటించి ఆకట్టుకున్న కంగనా రనౌత్ తమిళ చిత్రం ‘తలైవి’లో జయలలితగానూ నటించి మెప్పించింది. ఇప్పుడు ఇందిరా గాంధీ పాత్రను ‘ఎమర్జెన్సీ’ మూవీలో పోషించింది. 1975 నుండి 1977 వరకూ ఇందిరా గాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ పూర్వాపరాలను ఈ సినిమాలో కంగనా రనౌత్ చర్చించింది. ఎమర్జెన్సీ కాలం నాటి అకృత్యాలకు దర్పణంగా నిలిచే ఈ సినిమా పలు సవాళ్ళను ఎదుర్కొని ఎట్టకేలకు ఈ నెల 17న జనం ముందుకు రాబోతోంది. అయితే ఇందిరాగాంధీ గా తెరమీద కనిపించడం కోసం కంగనా ఎంత కష్టపడింది, ఎంత సహనాన్ని చూపించిందనేది తెలియచేస్తూ మేకర్స్ తాజాగా ఓ మేకోవర్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందిరాగాంధీగా కనిపించడమే కాకుండా ఆమెలోని భావోద్వేగాలను పలికించడం కోసం కూడా కంగనా గట్టి కసరత్తే చేసిందని ఈ వీడియో చూస్తుంటే అర్థమౌతోంది. మరి కంగనా పడిన శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుందో లేదో వేచి చూడాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *