Bengaluru: ప్రియమైన వారు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే ఆ బాధ నుంచి తేరుకోవడం కష్టం. కొందరు అసలు తట్టుకోలేరు. వారి మరణాన్ని జీర్ణించుకోలేరు. కొన్ని సందర్భాల్లో తాము విపరీతంగా ప్రేమించే వారిని కోల్పోయి.. ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వార్తలు మనం చాలా సార్లు వైన్ ఉంటాం. అయితే, తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క చనిపోయిందని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కొత్త సంవత్సరంలో విషాదంగా మారింది.
ప్రేమించిన పెంపుడు కుక్క చనిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరు రూరల్ నేలమంగళలోని హెక్కదేవనపుర గ్రామానికి చెందిన రాజశేఖర్ (33) తొమ్మిదేళ్ల క్రితం జర్మన్ షెపర్డ్ను కొనుగోలు చేశాడు. దానికి ‘బౌన్సీ’ అని పేరు పెట్టి తీసుకొచ్చాడు. అతనికి చాలా నచ్చింది. దానిని అసలు వదిలి ఉండేవాడు కాదు. దాని ఆలనా పాలనా చూడడం అంటే అతని అత్యంత ఇష్టమైన పనిగా మారిపోయింది. తన పని పూర్తయితే చాలు బౌన్సీ తోనే కలిసి తిరిగేవాడు. దానితోనే ఆడుకునే వాడు.
ఇది కూడా చదవండి: Today Horoscope: ఈ రాశుల వారికి అనుకున్నవి అన్నీ జరిగే అవకాశం.. ఈరోజు రాశి ఫలాలు ఇలా..
Bengaluru: కొన్ని రోజులుగా బౌన్సీ అనారోగ్యంతో బాధపడుతోంది. దానిని జాగ్రత్తగా చూసుకుంటూ వైద్య సహాయం అందిస్తూ వచ్చాడు రాజశేఖర్. కానీ
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బౌన్సీ నిన్నగాక మొన్న మృతి చెందింది. దీంతో రాజశేఖర్ కన్నీరు మున్నీరు అయ్యాడు. దాని మృతదేహాన్ని తన భూమిలో పూడ్చిపెట్టి రాజశేఖర్ తన ఇంటికి వచ్చాడు. తనకు ఎంతో ఇష్టమైన కుక్క చనిపోయిందనే బాధను తట్టుకోలేక విలపిస్తూనే ఉన్నాడు. రెండు రోజులు ఆ బాధతో తిండి కూడా తినకుండా ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో నిన్న జనవరి 01వ తేదీ తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ సంఘటన స్థానికులను కదిలించి వేసింది. కుక్క కోసం ప్రాణాలు తీసుకున్న రాజశేఖర్ మృతి పట్ల అందరూ ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియచేస్తున్నారు.
