Tripti Dimri : త్రిప్తి స్టన్నింగ్ లుక్ కి యూత్ ఫిదా

యానిమల్ చిత్రంలో అద్భుత నటనతో యువ హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ. ఫాలోయింగ్ విపరీతంగా పెరగడంతో నేషనల్ క్రష్ తోనూ గుర్తింపు సొంతం చేసుకుంది. ఒక్కో ప్రాజెక్ట్ కోసం కోట్లాది రూపాయల పారితోషికాన్ని ఈ బ్యూటీ అందుకుంటోంది. ఎక్కడ చూసిన ఈ భామ పేరే వినిపించింది. దీంతో సినిమా ఛాన్సులు, యాడ్స్, ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయింది. త్రిప్తి దిమ్రీ పేరు బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. ఇప్పటికిప్పుడు ఆషిఖి 3, దఢక్ 2. సహా పలు సీక్వెల్ చిత్రాల్లో నటిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్లకు సంతకాలు చేస్తోంది. తన సహనటుడు రాజ్ కుమార్ రావుతో కలిసి నటించిన ‘విక్కీ ఔర్ విద్యా కా వో వాలా’ ఈనెల 11న థియేటర్లలో విడుదల కానుంది.

మరోవైపు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్లను షేర్ చేస్తూ యూత్ కి నిరంతర ట్రీట్ ని అందిస్తోంది. తాజాగా ఆమె ఫొటోషూట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. అందమైన డిజైనర్ పరికిణీ.. దానికి కాంబినేషన్ గా క్రీమ్ కలర్ బ్లౌజ్ లో త్రిప్తీ రియల్ స్టన్నర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె జడలు హెయిర్ కట్.. దానికి కాంబినేషన్ చేతులకు బరువైన డిజైనర్ గాజులు, కంకణాలతో తన లుక్ ని మరింతగా ఎలివేట్ చేసాయి. త్రిప్తి స్టన్నింగ్ లుక్ కి యువత ఫిదా అయిపోతోంది.

వివాదంలో త్రిప్తి దిమ్రీ

ఇటీవల త్రిప్తి దిమ్రీ వివాదంలో చిక్కుకుంది.   జైపుర్‌కి చెందిన మహిళా వ్యాపారవేత్తలు ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ఇది జరిగింది. అయితే దీనికి హాజరవుతానని చెప్పి తృప్తి రూ.5.5 లక్షలు తీసుకుంది. ఈవెంట్ మొదలవడానికి ఐదు నిమిషాల ముందు వరకు వచ్చేస్తానని చెప్పిందట. తీరా రాకపోయేసరికి నిర్వహకులు, మహిళ వ్యాపారవేత్తలు తృప్తిపై నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఫొటోపై నల్లని పెయింట్ రాశారు. ఇక ఈ ఘటనపై స్పందించిన నిర్వహకురాలు.. తృప్తి బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిందని, ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. జైపుర్‌లో ఆమె సినిమాలని బ్యాన్ చేస్తామని, ఆమె తమని మోసం చేసిందని చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *