cake : ఘోరం.. కేక్ తిని ఐదేళ్ల బాలుడు మృతి

కర్ణాటకలోని బేకరీల్లో లభించే కేకుల్లో క్యాన్సర్ కారకాలు గుర్తించిన ఘటన మరువకముందే బెంగళూరులో ఐదేళ్ల బాలుడు కేక్ తిని చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. స్విగ్గీ డెలివరీ బాయ్ బాలరాజ్ ఆర్డర్ క్యాన్సిల్ అవడంతో సదరు కేక్‌ను ఇంటికి తీసుకొచ్చారు. దానిని ఎవరికీ పంచకుండా ఇంట్లోని భార్య, కుమారుడితో తినగా కొద్ది సేపటికే వీరు అనారోగ్యం పాలయ్యారు. కొడుకు ధీరజ్ చనిపోగా భార్యాభర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆలాగే ధీరజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఈ కేక్ ఆర్డర్ ఎవరు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు. ఏ బేకరీ ఈ కేక్ తయారు చేసిందో దర్యాప్తు చేస్తున్నారు. వారి ఫ్యామిలీ మధ్యాహ్నం, రాత్రి భోజనంలో రొట్టెలతో పాటు పాపడ్ తీసుకున్నట్లు చెప్పారు. వీటిని స్థానిక కిరాణా షాప్ నుంచి కొనుగోలు చేసినట్లు వివరించారు. కేక్ తిని బాలుడు చనిపోయిన ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బాలుడు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయినట్లు తెలిస్తే పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.

బెంగళూరు సిటీలో మాత్రం ఇప్పుడు కేక్ తినటం వల్లే ఐదేళ్ల బాలుడి మరణం జరిగిందనే వార్తలు సంచలనంగా మారింది. ఇటీవలే బెంగళూరు కేంద్రంగానే.. కేకుల తయారీలో క్యాన్సర్ కారక రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయన్న విషయం వెలుగులోకి వచ్చింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *