వైసిపి నేతలపై విమర్శలు చేశారు టీడీపీ నేత పట్టాభిరామ్. వైసీపీ హయాంలో వచ్చిన వరదల్లో బాధితులను కనీసం పలకరించినా పాపాన పోలేదని విమర్శించారు. బుడమనేరు వరదల వల్ల బాధితుల కోసం వివిధ వాటికి ఖర్చు పెట్టిన లెక్కలను ప్రకటించారు.తమ ప్రభుత్వం నిజాయితీగా చివరి అంకె వరకు లెక్క చెబుతుందని వెల్లడించారు.
సానిటేషన్‌కు కోసం ప్రభుత్వం రూ. 18,34 కోట్లు ఖర్చు పెడితే రూ. 51 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించడం మంచినీటి బాటిళ్లకు రూ. 11 కోట్లు పెడితే రూ. 21 కోట్లు అని, భోజనాలకు రూ. 57.4 కోట్లు అయితే రూ. 368 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
తమ ప్రభుత్వం నిజాయితీగా చివరి అంకె వరకు లెక్క చెబుతుందని వెల్లడించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడుతాడేపల్లి ప్యాలెస్‌లో సౌకర్యాల కోసం రూ. 15 కోట్లు మొత్తం విలాసవంతం కోసం రూ.4,800 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.ఎగ్‌పఫ్(Eggpups) ల కోసం రూ. 3.50 కోట్లు ఖర్చు చేసిన మీరు మమ్ములను విమర్శించేది అంటూ నిలదీశారు.

