Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, రెండో బెటాలియన్ కమాండెంట్ నితికా పంత్, ఎస్పీ గౌష్ ఆలంలు కుటుంబ సభ్యులతో పాల్గొని పూజలు నిర్వహించి బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. పోలీసుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.
