Amaran: ఇవాళ సక్సెస్ సాధించే దర్శకులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా… వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. పాన్ ఇండియా సినిమా కల్చర్ పెరిగిన తర్వాత ప్రాంతీయ భాషా చిత్రాలు కొన్ని ఐదు భాషల్లో విడుదల అవుతున్నాయి. ఒకవేళ సింగిల్ లాంగ్వేజ్ లో విడుదల అయినా… అది ఘన విజయాన్ని సొంతం చేసుకుంటే… రీమేక్ కావడం కాకుండా… వెంటనే మరో భాషలోకి అనువదించేస్తున్నారు.
ఇది కూడా చదవండి: KTR: ఎవ్వడికి భయపడను..
Amaran: తాజాగా ‘అమరన్’ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామికి ఇప్పుడు బాలీవుడ్ స్వాగతం పలుకుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సీరిస్ భూషణ్ కుమార్ ఓ పాన్ ఇండియా మూవీని రాజ్ కుమార్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వీరిద్దరూ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రావచ్చని అంటున్నారు.