Varun Tej: వరుణ్ తేజ్ నటించిన గత చిత్రాలు ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలంటైన్’, ‘మట్కా’ బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేశాయి. తాజా చిత్రం ‘మట్కా’ అయితే వరుణ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో రాబోయే వరుణ్ సినిమాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో రూటు మార్చిన వరుణ్ ఈ సారి హారర్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. రాయలసీమ నేపథ్యంలో ‘కొరియన్ కనకరాజు’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో అధికభాగం కొరియాలో షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో రితికా నాయక్ హీరోయిన్ గా నటించబోతోంది. తాజాగా వరుణ్ తేజ్, రితికా కు లుక్ టెస్ట్ కూడా చేసేశారు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రాల దర్శకడు మేర్లపాక గాధీ ఈ సినిమకు దర్శకత్వం వహిస్తున్నాడు. యువీ క్రియేషన్స్ తో కలసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ మూవీని నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధిచిన పూర్తి వివరాలు ప్రకటిస్తామంటున్నారు దర్శకనిర్మాతలు. మరి రూటు మార్చి హారర్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న వరుణ్ కి ఈ మూవీనైనా విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
