UI Movie

UI Movie: తెలివైనవారు ‘యువై’ చూడవద్దంటున్న ఉపేంద్ర!?

UI Movie: రొటీన్ కు భిన్నమైన సినిమాలు తీస్తారనే పేరు నటుడు ఉపేంద్రకు ఉంది. ఆయనకంటూ ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పడటానికి ఆయన తీసిన సినిమాలే కారణం. తాజాగా చాలా గ్యాప్ తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించి నటించిన ‘యుఐ’ ఆడియన్స్ ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో ఆకట్టకున్న ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. ఉపేంద్ర నటించిన తొలి పాన్ ఇండియా సినిమా కావటంతో ప్రచారం కూడా బాగానే చేశారు. సినిమా చూసిన వారు ఉపేంద్ర వన్ మేన్ షో అనేస్తున్నారు. ఇక థియేటర్స్ లో ఆరంభంలో స్క్రీన్స్ పై వచ్చిన డిస్క్లైమర్ ని ఆడియన్స్ తో పాటు నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు. అందులో ‘తెలివైన ప్రజలు మూర్ఖులుగా కనిస్తారు. మూర్ఖులు తెలివైన వ్యక్తులుగా నటిస్తారు.

UI Movie: మీరు ఫూల్ అయితే పూర్తి సినిమా చూడండి. ఇంటిలిజెంట్ అనుకుంటే వెంటనే థియేటర్ నుంచి బయటకు వెళ్ళండి’ అని వేశాడు ఉపేంద్ర. ఇది చూసిన ప్రేక్షకులు షాక్ కి గురవుతున్నారు. అంతే కాదు ఆ డిస్క్లైమర్ ను నెట్టింట్లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. చిన్ గ్యాప్ వచ్చినా ఉపేంద్రలో టాలెంట్ కి కొదవ లేదని అంటున్నారు. గ్యాప్ తర్వాత వచ్చిన ఉపేంద్ర సినిమా కావటంతో ఓపెనింగ్స్ వచ్చాయి. మరి సినిమా సక్సెస్ అయిందా? లేదా? అనే విషయం తేలాలంటే సోమవారం వరకూ ఆగాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుదో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *