Game Changer: గేమ్ ఛేంజర్’ ప్రీమియర్స్ ఉంటాయనే భరోసాను ఇచ్చేశారు దిల్ రాజు. ఇటీవల ‘పుష్ప2’ ప్రీమియర్స్ సందర్భంగా సంధ్యధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఓ బాలుడి పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకపై సినిమాల ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వమని చెప్పేశారు. అయితే తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో అన్ని పెద్ద సినిమాల మాదిరిగానే ‘గేమ్ ఛేంజర్’కి రెండు రాష్ట్రాలలో బెనిఫిట్ షోస్ ఉంటాయని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Jaipur Fire Accident: కాలిపోయిన మనుషులు.. రాలిపోయిన పిట్టలు.. జైపూర్ ట్యాంకర్ పేలుడు విధ్వంసం
Game Changer: సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను 21వ తేదీన ఫస్ట్ టైమ్ యుఎస్ లోని డల్లాస్ లో ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కోసం చరణ్ యుఎస్ బయలుదేరి వెళ్ళారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె. సూర్య ముఖ్య పాత్రధారులు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా శిరీష్ నిర్మించారు.