Bomb Blast at Airport: పాకిస్థాన్‌లోని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. బీబీసీ కథనం ప్రకారం ఈ పేలుడులో ఇద్దరు చైనా పౌరులు మరణించారు. అయితే చైనా మాత్రం భారీగా మరణాలు ఉన్నాయని చెబుతోంది. సింధ్ ప్రావిన్స్‌లోని పవర్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న చైనా ఇంజనీర్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిగినట్లు రాయబార కార్యాలయం తెలిపింది. ఈ దాడికి తామే బాధ్యులమని వేర్పాటువాద బలూచిస్థాన్ నేషనల్ ఆర్మీ ప్రకటించింది.
పేలుడులో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED)ని ఉపయోగించినట్లు సింధ్ ప్రావిన్షియల్ హోం మంత్రి జియా-ఉల్-హసన్ లాంజార్ అనుమానించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు జియో న్యూస్ వెల్లడించింది. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం జిన్నా ఆసుపత్రిలో చేర్చారు.
Bomb Blast at Airport: ఆదివారం రాత్రి 11 గంటలకు పేలుడు సంభవించిందని పాకిస్థాన్ మీడియా ఏజెన్సీ ఆజ్ న్యూస్ నివేదించింది. కారులో మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాద స్థలంలో భారీగా సైన్యాన్ని మోహరించారు.
విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారని హోం మంత్రిత్వ శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. పేలుడు శబ్ధంతో ఎయిర్‌పోర్టు భవనం కంపించిందని పౌర విమానయాన శాఖలో పనిచేస్తున్న రాహత్ హుస్సేన్ తెలిపారు.
Bomb Blast at Airport: విమానాశ్రయం సమీపంలో అర్థరాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. విమానాశ్రయం సమీపంలో పొగలు కనిపించాయి. విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలింది. పలువురు పాకిస్థానీ కార్మికులు మరణించారని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. మొత్తం మృతుల సంఖ్య అస్పష్టంగా ఉంది.