Chiranjeevi

Chiranjeevi: పాటలు లేకుండా చిరంజీవి సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే ఆయన డాన్సింగ్ హిట్స్ ఎన్నో గుర్తుకు వస్తాయి. ఇటీవల తన డాన్సింగ్ స్కిల్ తో గిన్నిస్ బుక్ ఆఫ్‌ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నారు. అలాంటిది చిరు సినిమాలో పాటలు లేకుండా అంటే ఫ్యాన్స్ కానీ, ప్రేక్షకులు కానీ ఊహించగలరా…? ఇప్పుడు అదే చేయబోతున్నారు శ్రీకాంత్ ఓదెల. నాని ‘దసరా’తో సెన్సేషనల్ హిట్ కొట్టిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా తీస్తున్నాడు.

ఇది కూడా చదవండి:  Neha Shetty: పవన్ ‘ఓజీ’లో నేహాశెట్టి ఐటమ్ సాంగ్

Chiranjeevi: సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నాడు. చెరుకూరి సుధాకర్ తో కలసి ఈ సినిమాను నాని నిర్మిస్తుండటం విశేషం. అయితే ఈ సినిమాలో పాటలు ఉండవని, యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారని వినిపిస్తోంది.

Chiranjeevi: అంతే కాదు అసలు హీరోయినే ఉండదంట. పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతోందట. మరి ఈ సినిమాతో కొత్త చిరంజీవిని చూపించబోతున్న శ్రీకాంత్ ఓదెల తన ప్రయత్నంలో సక్సెస్ అయితే చిరుతో మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలు వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుదో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *