KCR Movie

KCR Movie: ఆహాలో ‘కేసీఆర్’ మూవీ

KCR Movie: జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్‌ హీరోగా నటించి నిర్మించిన సినిమా ‘కేసీఆర్’. అనన్య కృష్ణన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ‘గరుడవేగ’ అంజి తెరకెక్కించారు. ‘కేశవ చంద్ర రమావత్’ అనే ఈ సినిమా నవంబర్ 22న విడుదలైంది. ఈ చిత్రానికి చక్కని ప్రేక్షకాదరణ లభించిందని ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో రాకింగ్ రాకేశ్‌ చెప్పారు. భార్య సుజాత ప్రోత్సాహం, మిత్రుల సహకారంతోనే తానీ సినిమాను విడుదల చేయగలిగాని రాకేశ్‌ అన్నారు.

ఇది కూడా చదవండి: Amla Pickle: నోరూరించే ఊరగాయపచ్చడి.. ఎన్ని లాభాలో

KCR Movie: ఈ సినిమా కోసం తనతో పాటు రెండేళ్ళు జర్నీ చేసిన ప్రతి ఒక్కరికీ రాకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి ఖచ్చితంగా అవార్డులు వస్తాయని, ‘కేసీఆర్ -2’ కూడా ఉంటుందని అన్నారు. ఈ సినిమా నచ్చి ఆహా ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ చేయడానికి ముందుకొచ్చిందని రాకేశ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్, దర్శకుడు అంజి, ఆహా అక్విజిషన్స్ హెడ్ శ్రీనివాస్ కుమార్, నటులు లోహిత్ కుమార్, రమేష్, మైమ్ మధు, రచ్చ రవి తదితరులు ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *