congress:అదానీపై జేపీసీ విచారణ, మణిపూర్‌లో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రధాని మోదీ వైఖరికి నిరసనగా ఏఐసీసీ పీలుపు మేరకు హైదరాబాద్‌లో పీసీసీ అధ్యర్యంలో బుధవారం చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
congress:దేశ ప్రధానమంత్రి మోదీ సహకారంతో అదానీ దేశంలోని అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని బ్యాంకులను మభ్యపెడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు నిరసించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. ఈ వ్యవహారంపై వినతిపత్రం ఇచ్చేందుకు రాజ్‌భవన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో రాజ్‌భవన్‌కు 100 మీటర్ల దూరంలో రేవంత్‌రెడ్డి సహా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
congress:ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అదానీ అంశంతోపాటు మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. తాము చేస్తున్న ఈ నిరసనతో కొందరికి కడుపు నొప్పి ఉండొచ్చు అని అన్నారు. ర్యాలీగా వెళ్తున్న తమను హైదరాబాద్ పోలీసులు అడ్డుకున్నారని, అందుకే రోడ్డుపై నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి తదితరులు పాల్గొన్నారు.

