Amla Pickle: వేడి వేడి అన్నం సాంబారుతో పచ్చళ్లు తింటే ఆ మజా వేరు. ఇందులో ముఖ్యంగా ఊరగాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది రుచి, పోషక విలువలతో కూడి ఉంటుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఉసిరికాయలోని విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఉసిరికాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
Amla Pickle: ఇవి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి మరియు ముడతలను నివారిస్తాయి. ఉసిరి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఉసిరి కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాల్షియం ఎముకలను బలపరుస్తుంది. ఆమ్లా జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: congress: కాంగ్రెస్ చలో రాజ్‌భవన్.. ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి
కావలసిన పదార్థాలు:
ఉసిరికాయ – 1 కిలో
చింతపండు – 100 గ్రా
ఆవాలు – 2 టీస్పూన్లు
మెంతులు – 2 tsp
వంట నూనె – అర లీటరు
ఉప్పు – 100 గ్రా
కారం – 100 గ్రా
జీలకర్ర – 1 tsp
తయారీ విధానం:
Amla Pickle: ఉసిరికాయను కడిగి, నీళ్లు పోసి మరిగించాలి. ఆ తరువాత స్టౌ మీద కడాయి పెట్టి అర లీటరు నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక ఉసిరి ముక్కలను వేసి వేయించాలి. ఉసిరికాయను మీడియం మంట మీద మెత్తగా అయ్యేవరకు వేయించాలి. వేయించిన ఉసిరి ముక్కలను మిక్సీలో రుబ్బుకోవాలి. దానిని ఒక కంటైనర్‌లో పోయాలి. చింతపండు, ఆవాలు, మెంతులు, ఉప్పు, కారం, ఇంగువ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన గాజు సీసాలలో నింపి గట్టిగా మూసి ఉంచాలి.