Akshay Kumar: అక్షయ్ కుమార్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘స్కైఫోర్స్’ మూవీ జనవరి 24న రిపబ్లిక్ డే కానుకగా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారు. ఓ ప్రత్యేక గీతంతో షూటింగ్ పూర్తి చేశామని చిత్ర బృందం సోషల్ మీడియాలో ప్రకటించింది. భారతదేశ మొదటి వైమానిక దాడి ఆధారంగా ‘స్కైఫోర్స్’ మూవీని సందీప్ కేవ్లానీ తెరకెక్కించారు.
ఇది కూడా చదవండి: Punishment To Staff: వృద్ధుడిపై సిబ్బంది నిర్లక్ష్యం.. నిల్చునే పని చేయండి సీఈఓ పనిష్మెంట్
Akshay Kumar: దినేశ్ విజన్ దీనిని నిర్మించారు. సారా అలీ ఖాన్, వీర్ పహారియా, నిమ్రత్ కౌర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. వచ్చే యేడాది అక్షయ్ కుమార్ నటించిన పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అందులో తెలుగు సినిమా ‘కన్నప్ప’తో పాటు ‘జాలీ ఎల్ఎల్.బి. -3’, ‘హౌస్ ఫుల్-5’ చిత్రాలూ ఉన్నాయి.

