AP News: ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఆ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అధికారులకు కూడా సమాచారం చేరవేసినట్టు తెలిసింది.
AP News: జనవరి 1 నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అమలుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనున్నది. ఈ పథకం అమలుపై రేపు జరిగే మంత్రిమండలి సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉన్నది.
AP News: ఇదిలా ఉండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు ఇప్పటికే విడుదల చేసింది. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్, మార్చి 3 నుంచి 20 వరకు సెకండియర్ పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉన్న విషయం తెలిసిందే.
