Aurabindo lyfus pharma

Aurobindo Lyfius Pharma: కాలుష్యం కక్కుతున్న అరబిందో లైఫ్ ఎస్ ఫార్మా.. బతుకు పోయిందంటున్న జనం!

Aurobindo Lyfius Pharma: ఒక ప్రాంతంలో ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే ఎన్నో అంశాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ రసాయనాలతో సంబంధం ఉన్న పరిశ్రమ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పర్యావరణం.. పరిశ్రమ పెట్టె ప్రాంతంలో ప్రజలపై చూపించే ప్రభావం ఇలాంటి విషయాలను కచ్చితంగా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. అనుమతులు ఇచ్చే ముందు అన్నిరకాలుగాను.. అన్ని శాఖల అనుమతులతోనూ ఏర్పాటు చేయాలి. సాధారణంగా ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే ఎన్నో కొర్రీలు వేస్తారు అధికారులు. కానీ, అరబిందో లైఫ్ యస్ ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో నిబంధనలు ఒక్కటి కూడా పాటించినట్టు కనిపించడం లేదు. వడ్డించేవాడు తమవాడైతే.. అనే విధంగా అధికారంలో తమ వారు ఉన్నారు.. అంతే.. ప్రపంచంలో ఎక్కడా దొరకని అనుమతులు పెన్సిలిన్ జి తయారు చేయడం కోసం అరబిందో లైఫ్ యస్ ఫార్మా కంపెనీకి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసింది అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం. దాని ఫలితం ఇప్పుడు అక్కడి ప్రజలు అనుభవిస్తున్నారు. తమ బాధలు చెప్పుకుని లబోదిబో అంటున్నారు. 

మహాన్యూస్ జరిపిన పరిశీలనలో అరబిందో లైఫ్ యస్ ఫార్మా కంపెనీకి సంబంధించి ఎన్నో విషయాలు బయటపడ్డాయి. అక్కడి ప్రజలను ఎవరిని కదిపినా వారు చెబుతున్న మాటలు ఇవే.. “ అరబిందో లైఫ్ యస్ ఫార్మా కంపెనీ వల్ల మా జల సంపదంతా నశించిపోతుంది.మా ఆయుష్షును అరచేతుల్లో పెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డాది. ఫార్మా కంపెనీ విడుదల చేసే వ్యర్ధ జలాలను సముద్రంలో కలిపెస్తున్నారు” అంటూ వాపోతున్నారు. 

Aurobindo Lyfius Pharma: నిజానికి కంపెనీ శంకుస్థాపన సమయంలో ఫార్మా వ్యర్ధ జలాలకు సంబంధించిన పైప్ లైన్లు కంపెనీ నుంచి సుమారు 57 కిలోమీటర్ల అవతల సముద్రంలో కలుపుతామని చెప్పినట్టు ఇక్కడి ప్రజలు అంటున్నారు. అయితే, కంపెనీ ప్రారంభించాక వాటిని ఇక్కడే విడుదల చేసే విధంగా అండర్ గ్రౌండ్ లో అవుట్ ఫ్లో లైను వేశారు అని చెప్పారు. 

కంపెనీ రన్నింగ్ అవ్వాలంటే రోజుకు సుమారు 134 ఎండియల్(1mdl అంటే 10 lakshla లీటర్ల)నీరు కావాలి. ఆ నీటిని సముద్రం ద్వారా పైప్ లైన్ వేసుకొని తీసుకుంటున్నారు. ఆ పైప్ లైన్ పక్కనే మరో పైప్ లైన్ ను వేశారు. ఈ పైప్లైన్ ద్వారానే సముద్రంలో వ్యర్ధ జలాలు కలిపేస్తున్నారని చెబుతున్నారు. 

“కంపెనీ ప్రారంభ దశలోనే మా గుండెలు ల లబోదిబోమని పరిస్థితి వచ్చింది. కంపెనీలో వినియోగించే బాయిలర్లు సౌండ్ తో మా ప్రాంత ప్రజలమంతా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి.మమ్మల్ని పట్టించుకునే నాయకుడే కరువయ్యారు.” అంటూ దీనంగా అక్కడి ప్రజలు చెబుతున్న పరిస్థితి ఉంది. 

Aurobindo Lyfius Pharma: గత వైసిపి ప్రభుత్వాన్ని పూర్తిగా అడ్డం పెట్టుకొని ksez నుంచి 500 ఎకరాలను భూమిని కంపెనీ నిర్మాణం కోసం  అరబిందో లైఫ్ యస్ తీసుకున్నారు. నిజానికి ఒక ఫార్మా పెన్సిలిన్ కంపెనీ పెట్టాలంటే 150 ఎకరాలు సరిపోతుందని సంబంధిత నిపుణులు అంటున్నారు. అయితే, 

కానీ ఈ లైఫ్ యస్ కంపెనీ యాజమాన్యం 500 ఎకరాలు తీసుకొని అందులో ధర్మల్ పవర్ ప్లాంట్ ను కూడా నిర్వహిస్తుంది. దీంతో భారీ పొల్యూషన్ వెలువడుతోంది. అంటే ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహించి మరింత వ్యర్ధ జలాల ద్వారా 20 గ్రామాలు  నాశనం అవుతున్నాయి. ఈ కంపెనీ వల్ల రెండు మండలాలు (ఉప్పాడ కొత్తపల్లి,తొండంగి) 20 గ్రాములు పూర్తిగా కాలుష్యకోరల్లో  చిక్కుకుంటున్నాయి. 

ప్రారంభ దశలోని కంపెనీ విడుదల చేసే పొల్యూషన్ వల్ల ఇప్పటికే మా గ్రామాల్లో జబ్బులు పాలయ్య పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా గర్భిణీలకు తమ గర్భం కోల్పోయే  పరిస్థితి కలుగుతుంది. అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 

Aurobindo Lyfius Pharma: కంపెనీ నిర్మాణ సమయంలో స్థానికంగా 50% ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన యాజమాన్యం..  కంపెనీ ప్రారంభమయ్యేక కనీసం 10% కూడా ఉద్యోగాలు కల్పించలేదు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఫార్మా డి పెన్సిలిన్ తయారు చేయడానికి నిరాకరించిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో గత వైసిపి ప్రభుత్వం ప్రమాదకరమైన ఫార్మా డీ పెన్సిలిన్ తయారు చేయడం కోసం అనుమతులు ఇవ్వడం దారుణం అని స్థానికులు అంటున్నారు. 

అభివృద్ధి ఎలా ఉన్నా సరే ఇటువంటి ప్రమాదకరమైన కంపెనీలు మాకు వద్దు. ఇప్పటికే మేము ksez కు భూములు ఇచ్చి మా జీవితాలను కోల్పోయాం. Ksez తీసుకున్న భూములన్ని సస్యశ్యామలంగా పంట పండేవి అటువంటి భూములను మా వద్ద నుంచి గత కాంగ్రెస్   ప్రభుత్వంలో తీసుకున్నారు.అప్పటినుంచి మేమంతా అప్పుల ఊబిలో జీవిస్తున్నాం. 

Aurobindo Lyfius Pharma: అదే సమయంలో స్థానికంగా హేచరీస్ రావడం వల్ల ఇప్పుడు మా కుటుంబంలో అందరూ అన్నం తింటున్నాము. ఈ ప్రాంతాల్లో ఉన్న సుమారు 400 హేచరీల్లో  పనిచేసే లక్ష మంది పైగా జీవిస్తున్నాం. మాకు అన్నం పెట్టే ఈ హేచరీస్  అన్నీ కూడా అరబిందో లైఫ్ యస్ కంపెనీకి చెందిన పొల్యూషన్ వల్ల మొత్తం మూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్లు విడుదల చేసే వ్యర్ధ జలాల వల్ల మాకు ఉన్న కోస్టల్ ఏరియా అంత విష కోరాలల్లో నిండిపోతుంది. దీంతో మాకు వేట ఉండదు.మొత్తం మత్స్య సంపదంత నాశనం అయిపోతుంది అంటూ అరబిందో లైఫ్ యస్ ఫార్మా కంపెనీ నిర్వాకంపై గగ్గోలు పెడుతున్నారు ఇక్కడి ప్రజలు 

సుమారు 75 కిలోమీటర్లు మొత్తం పొల్యూషన్ కోర్లు సముద్రం చిక్కుకొని నీరు కూడా పొల్యూషన్ అయిపోతుంది. ప్రధానంగా అక్కడక్కడ పండే పంట భూమి కూడా నాశనం అయిపోతది. ఇప్పటికే భూములు లాక్కోవడం వల్ల మా జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇక ఈ కంపెనీ రాయాక్టవు మాకు మరణమే గతిలా మారింది పరిస్థితి అని ప్రజానీకం రోదిస్తోంది. 

Aurobindo Lyfius Pharma: సుమారు 300 కోట్లు ఖర్చుపెట్టి 57 కిలోమీటర్లు వేస్తానన్న పైప్లైన్ తీసుకొచ్చి 20 కోట్లతో ఐదు కిలోమీటర్లు వేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి వినత పత్రం ఇవ్వడం జరిగింది. మా జీవితాల్ని కాపాడండి అని వేడుకున్నాం. 

విష కాలుష్యాల్లో చిక్కుకుపోబోతున్న సముద్రాన్ని కాపాడమని కోరుకున్నాం. ఇటువంటి ప్రమాదకరమైన కంపెనీలు ఎన్నుంటే ఉపయోగం ఏమిటి? మానవుడికి కావలసింది ఆరోగ్యంకానీ.. డబ్బు కాదని ఆయనకు చెప్పుకున్నాం. 

దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలుష్యంత్రమండలి సభ్యులను మా ఊరికి పంపించారు. అరబిందో లైఫ్ యస్ ప్రాంతం ఆవుల మందు అంత పర్యటించిన కాలుష్యం నియంత్రణ మండలి కూడా ఈ కంపెనీ వాళ్ళ విష కాలుష్యాలు ఏర్పడే అవకాశం ఉందని గుర్తించినట్లు తెలుస్తోంది. 

Aurobindo Lyfius Pharma: ఈ నేపథ్యంలో తక్షణమే ఇటువంటి కంపెనీలను నిలిపివేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అయితే అత్యధిక టెక్నాలజీతో వినియోగించే మిషనరీలను వినియోగించవలసి వస్తుందని.. అదే భారతదేశంలో అయిత నాసిరకం మిషనరీలు పెట్టి ప్లాంటును రన్ చేయొచ్చు అని ఆలోచనలో యజమానులు ఉన్నాయని తక్షణమే ఇటువంటి అభిప్రాయాలను విరమించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *