America:

America: అమెరికాలో తెలుగు యువ‌తి దుర్మ‌ర‌ణం.. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

America: అమెరికాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో తెలుగు యువ‌తి దుర్మ‌ర‌ణం పాలైంది. ఇదే ప్ర‌మాదంలో మ‌రో ఇద్ద‌రు తెలుగు యువ‌కులు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల అమెరికా దేశంలో రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్న‌ది. తెలుగు వ్య‌క్తులు కూడా పెద్ద సంఖ్య‌లో ప్ర‌మాదాల‌కు గుర‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ఉన్న‌త విద్యాభ్యాసానికి వెళ్లిన యువ‌త ఈ ప్ర‌మాదాల్లో బ‌ల‌వుతున్నారు. మ‌రికొంద‌రు తీవ్ర‌గాయాల‌తో క్ష‌త‌గాత్రులుగా మిగులుతున్నారు.

America: ప్ర‌స్తుతం అమెరికాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన యువ‌తి ప‌రిమ‌ళ (26) దుర్మ‌ర‌ణం చెందారు. తెనాలికి చెందిన వ్యాపారి గ‌ణేష్‌, ర‌మాదేవి దంప‌తుల కూతురైన ప‌రిమ‌ళ ఎంఎస్ చ‌దువు కోసం 2022లో అమెరికా దేశానికి వెళ్లింది. అక్క‌డి టెన్నెసీ రాష్ట్రంలో ఉంటున్న‌ది. ఆమె త‌న కారులో ప్ర‌యాణిస్తుండ‌గా, ఒక ట్ర‌క్ ఆమె కారును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ప‌రిమ‌ళ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది. ఇదే ప్ర‌మాదంలో నికిత్‌, ప‌వ‌న్ అనే మ‌రో ఇద్ద‌రు కూడా తీవ్రంగా గాయాల‌పాలైన‌ట్లు తెలిసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  CPI: సుడా చైర్మన్‌ పదవిపై కన్నేసిన సీపీఐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *