Daaku Maharaaj

Daaku Maharaj: పవర్ ఫుల్ బీట్ తో ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్ ప్రోమో

Daaku Maharaj: బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రజ్ఞాజైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై టైటిల్ గ్లింప్స్ తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేయబోయే ఫస్ట్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ పవర్ ఫుల్ ప్రోమో చూడగానే బాలకృష్ణ కి మరోసారి అదిరిపోయే ట్యూన్ ఇచ్చేశాడని అర్థం అవుతోంది.

ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరు టెకీ ఆత్మహత్య.. అతుల్ సుభాశ్ భార్య అరెస్ట్

Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్ కి కావలసిన మాస్ బీట్ ని అందిస్తున్నట్లు తేలింది. ‘డేగ డేగ దేఖో..’ అనే లిరిక్ తో వచ్చిన ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట ప్రోమోతో మరింత హైప్ పెరిగింది. నకాష్ అజీజ్ పాడిన ఈ పాట చార్ట్ బస్టర్ ఖాయం అనేలా ఉంది. థమన్ బీజీ గురించి అయితే చెప్పనవసరం లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రానున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, బాబీడియోల్, చాందినీ చౌదరి కీలక పాత్రధారులు. ప్రోమోతోనే సోషల్ మీడియాను అల్లకల్లోలం చేస్తున్న ఈ ఫస్ట్ సింగిల్ మొత్తంగా 14వ తేదీన విడుదల కానుంది

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vignesh Shivan: నయన్ భర్తకు శివకార్తికేయన్ నో!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *