Telangana: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా గురుకుల పాఠశాలల్లో, హాస్టళ్లలో విషాహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 45 మందికి పైగా విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్త డైట్ మెనూను ప్రవేశపెట్టింది. విద్యార్థుల కోసం నూతన నిబంధనలను అమలులోకి తేవాలని నిర్ణయించింది. ఫుడ్ కమిటీలను ఏర్పాటు చేసి పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకు పెట్టాలని ప్రభుత్వం ముందుకొచ్చింది.
Telangana: పేద విద్యార్థులకు పోషకాహారం అందించడానికి హాస్టళ్లలో కొత్త మెనూను ప్రభుత్వం ప్రారంభించింది. దీనికోసం 40 శాతం కాస్మొటిక్ చార్జీలను 200కు పెంచింది. ఒక్కోవారం మెనూ మారుతుంది. విద్యార్థులకు నెలకు రెండు సార్లు మటన్, చికెన్ విద్యార్థులకు పెట్టనున్నారు. వీటితోపాటు ఉడికించిన గుడ్లు, బ్రేక్ టైమ్లో పండ్లు, మిల్లెట్ బిస్కెట్లు ఇస్తారు. వేడి భోజనం వడ్డించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.