Bachhala Malli: హాస్యచిత్రాల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న ‘అల్లరి’ నరేశ్ కొంతకాలంగా రూట్ మార్చాడు. అర్థవంతమైన చిత్రాలను చేస్తూ నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ‘నాంది, ఉగ్రం’ వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీస్ చేసిన నరేశ్ తాజా చిత్రం ‘బచ్చల మల్లి’ కూడా ఆ కేటగిరీకి చెందిందే. సుబ్బు మంగాదేవి డైరెక్షన్ లో దీనిని రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Fateh: దేశభక్తి నేపథ్యంలో సోనూసూద్ ఫతేహ్
Bachhala Malli: ఈ నెల 20న రాబోతున్న ఈ సినిమా నుండి మేకర్స్ థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ‘మరీ అంత కోపం…’ అనే ఈ పాట హీరో అంతర్గత సంఘర్షణను, పశ్చాతాపన్ని తెలిపేలా హార్ట్ టచ్చింగ్ గా ఉంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ పాటను పూర్ణాచారి రాశారు. సాయి విఘ్నేష్ పాడారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రోహిణి, రావు రమేశ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.