benguluru

Bengaluru: బెంగళూరు టెకీ ఆత్మహత్య.. అతుల్ సుభాశ్ భార్య అరెస్ట్

Bengaluru: బెంగుళూరు లో కొన్ని రోజుల ముందు అతుల్ అనే వ్వక్తి ఆత్మహత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద అతుల్ సోదరుడు బికాస్ కుమార్ ఫిర్యాదు మేరకు బుధవారం మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో ప్రధాన పరిణామంలో, ఈ కేసుకు సంబంధించి మృతుడి భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి, సోదరుడు అనురాగ్‌లను అరెస్టు చేశారు. డీసీపీ వైట్ ఫీల్డ్ డివిజన్ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు నికితా సింఘానియాను హర్యానాలోని గురుగ్రామ్‌లో అరెస్టు చేశారు. నిందితులు నిషా సింఘానియా, అనురాగ్ సింఘానియాలను ప్రయాగ్‌రాజ్‌లో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు.

అతుల్ తన బెంగుళూరు అపార్టుమెంట్ లో ఉరేసుకోవడానికి ముందు 24 పేజీల సూసైడ్ నోట్, తో పాటు 80 నిముషాల వీడియో రికార్డు చేసి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అందులో నీకితా ఆమె కుటుంబం తన్నాని బెదిరిస్తునట్టు. డబ్బులకోసం వేదిస్తునట్టు ఆరోపించాడు. 

ఇది కూడా చదవండి: Bigg Boss: బిగ్ బాస్ 8 విన్నర్ ఇతనే..

Bengaluru: అతుల్ సుభాష్ భార్య, అతని అత్త, బావలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. అంతకుముందు, బెంగళూరు పోలీసులు వారిని మూడు రోజుల్లోగా హాజరుకావాలని కోరారు.

అతుల్ సుభాష్ నిజానికి ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వ్వక్తి. 34 ఏళ్ల AI ఇంజనీర్ అతుల్ సుభాష్  తన నివాసంలో విషాదకరంగా తన జీవితాన్ని ముగించాడు. తన వ్యక్తిగత, వ్యవస్థాగత సవాళ్లతో తీవ్ర మనోవేదనకు గురైన అతుల్ 24 పేజీల సూసైడ్ నోట్,1.5 గంటల వీడియోను విడిచివెళ్ళాడు. తన మీద తొమిదికి పైగా తప్పుడు కేసులు పెట్టారు అని వ్యవస్థలోని వైరుధ్యాలని ఇంకా తన్న వివాహం చేసుకోవడం వల్ల  వచ్చిన ఇబంధులా గురించి వివరించాడు. 

Bengaluru: అతుల్ సోదరుడు బికాస్ కుమార్ ఫిర్యాదు మేరకు బుధవారం మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అతని భార్య నికితా సింఘానియా,అత్తగారు, నిషా సింఘానియా, బావమరిది, అనురాగ్ సింఘానియా. మేనమామ సుశీల్ సింఘానియాపై BNS సెక్షన్ 108,సెక్షన్ 34కింద కేసు నమోదు చేశారు.

ALSO READ  Gold Price Today: గుడ్‌న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తులం బంగారం ఎంతంటే..!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *