Sambarala Yetigattu

Sambarala Yetigattu: సంబరాల ఏటిగట్టున’ సాయి తేజ్ ఊచకోత

Sambarala Yetigattu: ‘రేయ్’ సినిమాతో చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మ తేజ్ కెమెరా ముందుకొచ్చాడు. అయితే విడుదలైన మొదటి చిత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’. ఇప్పుడు తల్లి పేరుతో తన పేరుతో జత చేసుకుని సాయి దుర్గ తేజ్ అని మార్చుకున్నాడు. ఈ పదేళ్ళలో జయాపజయాలను చవిచూసిన దుర్గ తేజ్ ఇప్పుడు ‘ఎస్.వై.జి.’ సంబరాల ఏటి గట్టు అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీనిని ‘హను-మాన్’ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. రోహిత్ కె.పి. దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan’s OG: పవన్ కల్యాణ్ ఓజీలో జపనీస్‌, థాయ్‌ యాక్టర్లు

Sambarala Yetigattu:ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను గురువారం రామ్ చరణ్ తేజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు దర్శకులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఐశ్వర్య లక్ష్మీ నాయికగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *