Chandrababu: జమిలి అమలులోకి వచ్చినా, ఎన్నికలు 2029లోనే జరుగుతాయి

Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శనివారం మీడియా సమావేశంలో జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఒక దేశం, ఒకే ఎన్నిక” విధానానికి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. జమిలి అమలులోకి వచ్చినా, ఎన్నికలు 2029లోనే జరుగుతాయని స్పష్టం చేశారు.

తన వ్యాఖ్యలు కొనసాగిస్తూ, వైసీపీ నేతలు జమిలి మీద అవగాహన లేకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. “వైసీపీ నాయకులు పబ్లిసిటీ కోసం ప్రజలను తప్పుపడేయడానికి ఏది కావలసినదైనా మాట్లాడుతున్నారు” అని పేర్కొన్న చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ప్రజలలో విశ్వసనీయతను కోల్పోయారని, వారి నాటకాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని, “స్వర్ణాంధ్ర విజన్ 2047” అనే డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని చంద్రబాబు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *