Mohan babu: తాను కనిపించడం లేదనే కథనాలపై మంచు మోహన్ బాబు స్పందించారు. “తన బెయిల్ పిటిషన్ను కోర్టు రిజెక్ట్ చేసిందన్న వార్తలను తప్పు అని నిరాకరించారు. ఈ సందర్భంలో, కోర్టు తన బెయిల్ పిటిషన్ను తిరస్కరించలేదని ఆయన స్పష్టం చేశారు. మోహన్ బాబు కేవలం తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.
మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ, వాస్తవాలను మాత్రమే వెల్లడించాలని కోరారు. ఈ పరిణామాలు వాస్తవాలకు కట్టుబడి ఉండాలని, ప్రజలకు తప్పు సమాచారం ఇవ్వడం తగదని ఆయన సూచించారు.
కాగా, జర్నలిస్ట్ పై దాడి జరిగిన ఘటనలో మోహన్ బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని ఆ బెయిల్ పిటిషన్ కొట్టివేతకు గురైందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. పోలీసులైనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కానీ ఆయన మాత్రం పరారీలో ఉన్నారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో రచ్చ లేపింది. తాజాగా ఈ వార్తలన్నీ అవాస్తం అని చెప్పి మోహన్ బాబు ఎక్స్ వేదికగా స్పందించారు

